హాట్ స్టార్ కి నివిన్ పౌలీ పొలిటికల్ థ్రిల్లర్!

  • మలయాళంలో రూపొందిన 'ప్రతిఛాయ'
  • రాజకీయాల నేపథ్యంలో నడిచే కథ 
  • ప్రధానమైన పాత్రను పోషించిన నివిన్ పౌలీ 
  • ఈ నెల 24వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో

మలయాళంలో నివిన్ పౌలీ తనదైన మార్క్ చూపిస్తూ ముందుకెళుతున్నాడు. లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ ఆకట్టుకుంటున్నాడు. సహజంగా అనిపించే ఆయన నటనకి చాలామంది అభిమానులు ఉన్నారు. ఇక థియేటర్స్ లోనే కాకుండా ఓటీటీలలోను ఆయన సినిమాలకి మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి నివిన్ పౌలీ నుంచి వచ్చిన తాజా చిత్రంగా 'ప్రతిఛాయ' కనిపిస్తుంది. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమాను ఉన్నికృష్ణన్ తెరకెక్కించాడు.

మార్చి 26వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. పొలిటికల్ డ్రామాను నడిపించిన తీరుకు దర్శకుడికి .. ఆ పాత్రలో ఒదిగిపోయినందుకు నివిన్ పౌలీకి అభినందనలు లభించాయి. అలాంటి ఈ సినిమా ఈ నెల 24వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. విష్ణు అగస్త్య .. సబితా ఆనంద్ .. హరిశ్రీ అశోకన్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

కథలోకి వెళితే .. కేరళ ముఖ్యమంత్రి వర్గిస్ కి ఇద్దరు కొడుకులు. మొదటి నుంచి కూడా జాన్ రాజకీయాలకు దూరమే. ప్రస్తుతం అతను ఐటీ రంగంలో ఉంటాడు. తండ్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం .. ఆయన రాజీనామా చేయడం .. ఆ మనస్తాపంతో చనిపోవడం చకచకా జరిగిపోతాయి. తప్పనిసరి పరిస్థితులలో జాన్ రాజకీయాలలో అడుగుపెడతాడు. అతని రాకతో చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది కథ.


Nivin Pauly
Prathichaya
Nivin Pauly movie
Hotstar
Malayalam movie
Political thriller
Unnikrishnan
Kerala politics
OTT release
Vishnu Agastya

More Telugu News